ఆగస్టు 15 లోగా రుణమాఫీ సాధ్యమేనా- రేవంత్ సమర్ధతకు పరీక్ష..!!
తెలంగాణలో రైతు రుణ మాఫీ అమలు ఎప్పుడు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతోంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఆగస్టు 15 లోగా అమలు చేస్తానని సీఎం రేవంత్ ప్రమాణం చేస్తున్నారు. ఇదే అంశం పైన బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. దీంతో, అసలు ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు సాధ్యమేనా. ఏం జరుగుతోంది. ఏం జరగనుంది.
రుణమాఫీ అమలు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. రేవంత్ సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ ను టార్గెట్ చేసేందుకు రైతు రుణమాఫీ అంశాన్ని ప్రధానంగా నిలదీస్తున్నాయి. అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నాయి. దీంతో, రేవంత్ ప్రతీ సభలోనూ రుణ మాఫీ పైన స్పష్టత ఇస్తున్నారు. ఆగస్టు 15లోగా అమలు చేస్తామని చెబుతున్నారు. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసి హామీ అమలు చేసేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అయితే, చెబుతున్న సమయంలోగా సాధ్యమేనా అనేది సందేహంగా మారుతోంది.
కటాఫ్ డేట్ ఏది
రైతురుణ మాఫీ పైన ప్రభుత్వం కొన్ని కీలక అంశాల పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రుణమాఫీ కటాఫ్ తేదీ ఖరారు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ సర్కారు తొలిసారి రుణమాఫీ చేసినప్పుడు 2014 మార్చి 30 వరకు ఉన్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికి 23 లక్షల మందికి సంబంధించిన రూ.13 వేల కోట్లను మాఫీ చేసింది. మాఫీ చేయాల్సిన రైతుల రుణం రూ. 32 వేల కోట్ల వరకు ఉంటుందని గతంలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్పోరేషన్ ఏర్పాటు
కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ చేయాలని భావిస్తే, బడ్జెట్‌తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బ్యాంకుల రుణాలను కార్పొరేషన్‌కు బదలాయిస్తే ప్రతి నెలా కచ్చితంగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌కు రుణాలను బదిలీ చేసేందుకు బ్యాంకులు అంగీకరించాలి. సదరు కార్పొరేషన్‌కు రెగ్యులర్‌గా వచ్చే ఆదాయ మార్గాలను బ్యాంకులకు చూపించాల్సి ఉంటుంది. దీంతోపాటు బ్యాంకులకు ప్రభుత్వం నమ్మకం కల్పించాలి. బాండ్స్ రూపంలో గానీ, ఇతర మార్గాల్లో గానీ బ్యాంకులకు ప్రభుత్వం ష్యురిటీ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు రుణమాఫీ అమలు వ్యవహారం సీఎం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications