దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా వరంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్దిగా బరిలో ఉన్న కడియం శ్రీహరి కుమార్తె ఆ పార్టీకి రాజీనామా చేసారు. కేకే, కడియం లాంటి వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్ ఎపిసోడ్ ఆసక్తి రంగా మారుతోంది.
కొత్త వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల పైన గురి పెట్టింది. గ్రేటర్ పరిధిలో కీలక నేతలతో టచ్ లోకి వెళ్లింది. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీతో పాటుగా పరిధిలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది.

సీనియర్ నేతలు కేకే, కడియం వంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంటోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. దానం ను కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి తమ అభ్యర్దిగా ప్రకటించింది. ఇదే సమయంలో దానం ను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.
దానం స్థానంలో
దీనికి తొలుత అంగీకరించిన దానం ఇప్పటి వరకు పదవికి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి దానం అంగకరించటంతో మూడో జాబితాలో దానం పేరు ప్రకటించారు. కానీ, దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఇదే సమయంలో దానం పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
కోర్టు సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం పరిణమాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం దానం నాగేందర్ ను సికింద్రాబాద్ అభ్యర్దిగా తప్పించాలని చూస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.
మరొకరికి అవకాశం
ఆయన స్థానంలో మరో అభ్యర్ది వైపు పార్టీ నాయకత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పేరు ఖరారైంది. ఈ స్థానంలో గెలవటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తుందనే ఆసక్తి కరంగా మారుతోంది.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు తో పాటుగా మాజీ మంత్రి పేరును పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు లేదా రేపు అభ్యర్ది పైన స్థానిక నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయనను కొనసాగించటం..లేదంటే మరో అభ్యర్దిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications