అన్ని పార్టీలు తిరిగొచ్చి మాకు మంత్రి పదవి కావాలంటున్నాడు.. ఎమ్మెల్యే సంచలనం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే తోటి ఎమ్మెల్యే విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే వివేక్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.వివేక్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివేక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.
అన్ని పార్టీలు తిరిగొచ్చి మాకు మంత్రి పదవి కావాలంటున్నాడు..!!#BJP #Congress #BRS #TGPolitics #TelanganaPolitics #PoliticsToday #Oneindiatelugu pic.twitter.com/7UciRVFhdX
— oneindiatelugu (@oneindiatelugu) April 14, 2025
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివేక్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభలో డిప్యూటీ సీఎం భట్టి సాక్షిగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వినోద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు నేడు మంత్రి కావాలని చూస్తున్నారని వివేక్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరోక్షంగా కామెంట్ చేశారు.

సొంత పార్టీలోని ఎమ్మెల్యే పై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ విమర్శలపై ఎమ్మెల్యే వివేక్ స్పందించారు.మా కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామని ఆయన గుర్తు చేశారు. మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడు ఎవర్ని ఆడగలేదని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు.












Click it and Unblock the Notifications