కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రాంరెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు పిఏసి చైర్మన్‌గా పని చేస్తున్నారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రాంరెడ్డి వెంకట రెడ్డి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కెసిఆర్, ఖమ్మం జిల్లా నేతలు, ఇతర పార్టీలు సంతాపం తెలిపారు.

సుజాత నగర్ నియోజకవర్గం నుంచి...
గతంలో సుజాత నగర్ నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వెంకట్ రెడ్డి 2009, 2014లలో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నెల రోజుల క్రితం శ్వాస సంబంధ వ్యాధితో కిమ్స్‌లో చేరారు. అమెరికాలోను చికిత్స పొందారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు.
ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1999, 2004 నుంచి అక్కడి నుంచే గెలుపొందారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications