హరీష్ రావు వచ్చి వెళ్లాడని అమరవీరుల స్థూపానికి పసుపు నీళ్లతో శుద్ధి

Telangana Lok Sabha polls 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది కూడా. వాటిని ఉససంహరించుకోవడానికి ఈ నెల 29వ తేదీ వరకు సమయం ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Congress MLC Balmoor Venkat slams BRS leader Harish Rao

ఈ పరిస్థితుల్లో హరీష్ రావు రాజీనామా లేఖ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది. ఈ ఉదయం ఆయన అమరవీరుల స్తూపాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. తన వెంట రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చారాయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చెప్పిన విధంగా ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీని అమలు చేస్తే- తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.

దీనిపై తాజాగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు బల్మూర్ వెంకట్ ఘాటుగా స్పందించారు. అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. హరీష్ రావును అమరవీరుల చావుకి కారణమైన హంతకుడిగా అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్నాడని ధ్వజమెత్తారు.

అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం వల్ల ఈ ప్రాంతం మైల పడిందిని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని అన్నారు. పదేళ్లుగా హరీష్ రావుకు గానీ, ఇతర బీఆర్ఎస్ నాయకులకు గానీ ఏనాడు కూడా అమరవీరులు గుర్తుకు రాలేదని విమర్శించారు. ఇప్పుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ స్థూపాన్ని వాడుకుంటోన్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్‌లో హరీష్ రావు ఒక జీతగాడు మాత్రమేనని వెంకట్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని అన్నారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారని, అయినా దాన్ని వృధా కానివ్వబోమని పేర్కొన్నారు.

ఆగస్టు 15 తరువాత హరీష్ రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని వెంకట్ చెప్పారు. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన ఆయనకు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా అంటూ చురకలు అంటించారు. రాజకీయాల కోసం రాజీనామా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+