కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం షురూ..! గులాబీ పార్టీకి ధీటుగా బ‌హిరంగ స‌భ‌లు..!!

హైద‌రాబాద్: రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల యుద్దానికి కాంగ్రెస్‌పార్టీ అస్త్ర శ‌స్త్రాల‌తో సన్నద్దం అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో చీలిక రాకుండా ఉండేందుకు ఓ పక్క కలిసి వచ్చే పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీడీపీ, టీజేఎస్‌, సీపీఎం నాయకులతో ఓ పక్క సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ఏజెండా రూపొందించేందుకు చర్చలు, సమావేశాలు నిర్వహిస్తోంది. మహాకూటమి ఏర్పాటుకు కలిసి వస్తున్న పార్టీల నేతలతో సీట్ల సర్దుబాటు త్వరలో కొలిక్కి రానుంది. ఇదిలా ఉండగానే ఎన్నికల మెనిఫెస్టో కమిటీ తనపని తాను చేసుకుపోతోంది.

అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేసే దిశ‌గా కంగ్రెస్ మేనిఫెస్టో..! ప్ర‌చారం షురూ...!!

అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేసే దిశ‌గా కంగ్రెస్ మేనిఫెస్టో..! ప్ర‌చారం షురూ...!!

మెనిఫెస్టోలో చేర్చే ప్రజా సమస్యలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నది. 45 రోజుల పాటు 90 నియోజక వర్గాలు, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ కసరత్తు ప్రారంభించింది. మరోసారి తెలంగాణ సెంటిమెంటు రగిలించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని స‌మాచారం. కళా బృందాల పాటలు, ఆటలతో ప్రజల్లో కదలిక తేవాలని చూస్తున్నరని తెలుస్తోంది. ఇక తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ తో ప్రచారం చేయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో మూడు సభలు నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది.

బ‌హిరంగ స‌భ‌ల‌కు సోనియా..! ప్ర‌ణాళిక ర‌చిస్తోన్న టీపిసిసి..!!

బ‌హిరంగ స‌భ‌ల‌కు సోనియా..! ప్ర‌ణాళిక ర‌చిస్తోన్న టీపిసిసి..!!

సోనియాగాంధీతో ఉత్తర తెలంగాణలో ఒక సభ , దక్షణ తెలంగాణ లో మరో సభ , హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఇక పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 10 సభలు కర్ణాటక తరహాలో నిర్వహించి రాష్ట్ర మంతా పర్యటించాలనుకుంటున్నట్లు భోగట్టా. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆధారంగా షార్ట్ ఫిల్మ్‌లు తీసి సోషల్ మీడియాలో ప్రచారానికి వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. మరి కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతవరకూ కలసివస్తాయో వేచి చూడాల్సిందే.

సినీ హీరో సుమ‌న్ ను ఆశ్ర‌యించిన గులాబీ పార్టీ..! ప్ర‌చారానికి ఓకే చెప్పిన ఆత్మ బందువు..!!

సినీ హీరో సుమ‌న్ ను ఆశ్ర‌యించిన గులాబీ పార్టీ..! ప్ర‌చారానికి ఓకే చెప్పిన ఆత్మ బందువు..!!

తెలంగాణ‌లో ముంద‌స్తు ముచ్చ‌ట‌తో సినీ న‌టుడు సుమ‌న్, గులాబీపార్టీలో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన సుమ‌న్‌కూ ఫ్యాన్స్‌తోపాటు.. సామాజిక‌వ‌ర్గంలోనూ మంచి అనుబంధం ఉంది. తెలంగాణ‌లో యాద‌వ్‌, గౌడ వ‌ర్గాల‌కు అన్నిపార్టీలు పెద్ద‌పీట వేస్తాయి. ఆర్ధికంగా.. ఓటు బ్యాంకు ప‌రంగా ఈ రెండు వ‌ర్గాలు ఎటువైపు నిలిస్తే.. ఆ పార్టీ విజ‌యం గ్యారంటీ అనేది కూడా గ‌తంలో ప‌లుమార్లు నిరూప‌ణైంది. విజ‌యశాంతికి ధీటుగా సుమ‌న్ ప్ర‌చారాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చ‌నే గులాబీపార్టీ భావిస్తుందట‌.

తెలంగాణ‌లో కాంగ్రెస్ నుండి రాముల‌మ్మ ప్ర‌చారం.. ! కాంగ్రెస్ ఫుల్ జోష్..!!

తెలంగాణ‌లో కాంగ్రెస్ నుండి రాముల‌మ్మ ప్ర‌చారం.. ! కాంగ్రెస్ ఫుల్ జోష్..!!

గ‌తంలోనూ ఏపీ నుంచి బ‌రిలోకి దిగుదామ‌ని భావించినా, వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇప్పుడు తెలంగాణ‌లో అవ‌కాశం రావ‌టంతో సుమన్ రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ప‌ట్ల సానుకూలంగా మాట్లాడిన సుమ‌న్‌, కేసీఆర్ వంటి సీఎం తెలంగాణ‌కు అవ‌స‌ర‌మంటూ ముక్తాయించారు. మూడు పార్టీల‌కు అనుకూలంగా మాట్ల‌డిని హీరో సుమ‌న్‌, అంతిమంగా కేసీఆర్‌కే జై కొట్టేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+