ఆకులకు కాంగ్రెస్ ఛాన్స్: అలిగిన దానం, రాజీనామా

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీంతో గ్రేటర్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా అయితే, గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు.

బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్‌ సింగ్‌కు పంపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత నియామకాన్ని ఆయన తప్పుపట్టారు. త్వరలో గ్రేటర్‌ ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయంలో గ్రేటర్‌ పరిధిలోని నేతలను కాకుండా, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆకుల లలితను ఎంపిక చేయడం సరికాదని ఆయన చెప్పారు.

Danam Nagender

ఇలాంటి సమయంలో తెరాసను ఎదుర్కొనాలంటే ఎమ్మెల్సీ టికెట్‌ గ్రేటర్‌ పరిధి నేతలకు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య లేదా ఇతర సీనియర్లకు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన చెబుతున్నారు. అయితే, తాను పార్టీని వీడనని చెప్పారు.

మహిళకు ఇవ్వాల్సి వస్తే మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేదని దానం చెబుతున్నారు. సబితకు గ్రేటర్ పైన పట్టు ఉందని ఆయన చెప్పారు. కాగా, ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్ర నుండే ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+