మరి రూ.2000 నోటు ఎందుకు
హైదరాబాద్: నల్లధనం పోతుందో లేదో కానీ ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు నిలబడిన వారిలో నల్లధనం ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడంతో ఎందుకు విఫలమయ్యారో కేంద్రం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల వల్లే నల్లధనం పెరుగుతుందనుకుంటే 2000 నోటు ఎందుకని ఉత్తమ్ నిలదీశారు. రాజకీయ అవినీతికి తాము కూడా కొంత బాధ్యులమేనని, అంతా కలిసి రాజకీయ అవినీతిని పారదోలాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications