కాంగ్రెస్ మూడో జాబితా విడుదల: 16 మంది అభ్యర్థుల్లో వీరికే చోటు, కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానం నుంచే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ పై పోటీ చేస్తానని గతంలో రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ ఇప్పటికే కోడంగల్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు, కామారెడ్డి నుంచి కాకుండా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ఇక బోథ్, వనపర్తి స్థానాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థుల పేర్లలో మార్పులు చేసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి, బోథ్‌లో వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్‌కు టికెట్లు కేటాయించారు. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లోనే ఉండటం గమనార్హం. సూర్యాపేట, తుంగతుర్తి స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ఖరారు చేయలేదు.
మూడో జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థులు:
కామారెడ్డి: రేవంత్ రెడ్డి
చెన్నూరు: వివేక్ వెంకటస్వామి
బోథ్: ఆడే గజేందర్
జుక్కల్: తోట లక్ష్మీకాంతారావు
బాన్సువాడ: ఏనుగు రవీందర్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్: షబ్బీర్ అలీ
కరీంనగర్: పురుమల్ల శ్రీనివాస్
సిరిసిల్ల: కొందం కరుణ మహేందర్ రెడ్డి
నారాయణ్ ఖేడ్: సురేష్ కుమార్ షెట్కర్
పటాన్ చెరు: నీలం మధు ముదిరాజ్
వనపర్తి: మేఘా రెడ్డి
డోర్నకల్: జాటోత్ రామచంద్రు నాయక్
ఇల్లందు: కోరం కనకయ్య
వైరా: రామదాస్ మాలోత్
సత్తుపల్లి: మట్టా రాగమయి
ఆశ్వారావుపేట: జారె ఆదినారాయణ.












Click it and Unblock the Notifications