కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చర్యలు - తేల్చి చెప్పిన జైరాం రమేశ్..!!

మునుగోడు ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఇందులో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతోంది. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ.. ప్రచారం చేయకపోవటంతో ఆయన పైన కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పార్టీ పరాజయంలో ఆయన పాత్ర పైన విమర్శలు మొదలు పెట్టారు. మునుగోడు నుంచి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన స్రవంతి కీలక వ్యాఖ్యలు చేసారు. వెంకటరెడ్డి కోవర్టు రాజకీయాలు చేసారంటూ ఆరోపించారు. వెంకటరెడ్డి చర్యలను హైకమాండ్ గుర్తించిందని చెప్పారు.

కోమటిరెడ్డి పైన చర్యలు ఉంటాయని స్రవంతి చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వ్యవహారం పైన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేశ్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి షోకాజ్ నోటీస్ ఇచ్చామని..సమాధానం ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందని పేర్కొన్నారు. వెంకటరెడ్డి నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ కి క్రమశిక్షణ ముఖ్యమని చెప్పిన జై రాం రమేష్ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, మునుగోడు ఫలితాల తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం వెంకటరెడ్డి తన సోదరుడికి ఓటు వేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ లో చెప్పిన ఆడియో వైరల్ అయింది.

 Congress Senior leader Jairam Ramesh gave clarity on Action against Komatireddy Venkata Reddy

దీని పైనే వివరణ కోరుతూ ఏఐసీసీ షోకాజ్ జారీ చేసింది. పది రోజుల సమయం ఇచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం వెంకటరెడ్డి ఈ నోటీసుకు సమాధానం ఇచ్చారని సమాచారం. తాను సుశిక్షుతడైన కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నానని, తనకు పార్టీలో గుర్తింపు లేదంటూ వివరణ లేఖలో పేర్కొన్నారు. తారక్ అన్వర్ కు పంపిన సమాధానంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగించిన భారత్ జోడో యాత్రకు దూరంగా ఉన్నారు.

దీనికి స్పందించిన ఆయన నోటీసు ఇచ్చిన తరువాత తాను ఎలా యాత్రలో పాల్గొంటానని..క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత స్పందిస్తానని చెబుతున్నారు. దీని ద్వారా ఆయన రాజకీయ నిర్ణయం ఏంటనేది ఆసక్తి గా మారుతోంది. ఇదే సమయంలో మునుగోడు ఓటమి రివ్యూ వేళ..కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ గా విమర్శలు మొదలయ్యాయి. పార్టీ అధినాయకత్వం తీసుకొనే నిర్ణయాల కోసం వెంకటరెడ్డి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది... వెంకటరెడ్డి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+