కాంగ్రెస్ ముందంజ - ఎగ్టిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ..!!
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ కొన్ని స్థానాల్లో ఈ రెండు పార్టీలకు ధీటైన ప్రత్యర్ధిగా నిలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా నివేదికలు ఇవ్వటంతో ప్రస్తుతం వస్తున్న అంచనాలు అవి నిజం అయ్యే దిశగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ లో తొలి ఫలితాలు ఆసక్తి కరంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్స్ తో పాటు ఈవీయం ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఒక టేబుల్ పై పోస్టల్ బ్యాలెట్స్, 14 టేబుల్స్ పై ఈవీయం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 49 కౌంటింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న అన్ని రకాల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. బీఆర్ఎస్ కంటే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.

సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో నిలిచారు. కోమటిరెడ్డి బ్రదర్స్, మధిరలో భట్టి, కొడంగల్ లో రేవంత్, ఖమ్మంలో తుమ్మల, రామగుండం, ధర్మపురం, మంచిర్యాల, వరంగల్ ఈస్ట్ లో కాంగ్రెస్ అభ్యర్దులు ముందంజలో కొనసాగున్నారు. డోర్నకల్ పోస్టల్ బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. అనూహ్యంగా నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరలోకి ఒక నియోజకవర్గంలో ఎంఐఎం ఆధిక్యతలో ఉంది. కరీంగనర్, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్దులు ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ, కామారెడ్డిలో తాజా సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు.
ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా..బీఆర్ఎస్ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుండటం తో బీఆర్ఎస్ పైన పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. అయితే, ఈవీఎంల కౌంటింగ్ లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ఎస్ మాత్రం తుది ఫలితాలు తమకే అనుకూలమని ఇప్పటికీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ , బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications