జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో "కాంగ్రెస్" విజయ దుందుభి.. దాదాపు 25 వేల మెజార్టీ !
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు తెర పడింది. హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందారు. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే ఆధిక్యం కనబరిచిన నవీన్ కుమార్ యాదవ్.. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపులోనూ మొదటి రౌండ్ నుంచే దూసుకుపోయారు. దీంతో పెద్ద ఎత్తున గాంధీభవన్ చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు.. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు సందడి వాతావరణం నెలకొంది.
ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. మొదటి రౌండ్ నుండే దూసుకుపోయిన కాంగ్రెస్.. అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ కంటే ముందుంజలో నిలిచింది. కేవలం ఒక మూడో రౌండ్‌లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీ సాధించినప్పటికీ.. ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ జోరు అందుకోవడంతో కారు పార్టీ వెనుకంజ వేయక తప్పలేదు. చివరికి, నవీన్ యాదవ్ 25 వేలకు పైగా.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ ఫలితాలను ఈసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాటిజ్ కోల్పోయారు. దాంతో కౌంటింగ్ మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి.
రౌండ్ల వారీగా అభ్యర్థులు సాధించిన ఓట్లు..
మొదటి రౌండ్..
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 8,911; మాగంటి సునీత (BRS): 8,864; దీపక్ రెడ్డి (భాజపా): 2167;
రెండో రౌండ్..
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,691; మాగంటి సునీత (BRS): 8,609; దీపక్ రెడ్డి (భాజపా): 3475;
మూడో రౌండ్..
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 11,082; మాగంటి సునీత (BRS): 8,082; దీపక్ రెడ్డి (భాజపా): 3,475;
నాలుగో రౌండ్..
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,567; మాగంటి సునీత (BRS): 6,020;
ఐదో రౌండ్..
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 12,283; మాగంటి సునీత (BRS): 8985;
ఆరో రౌండ్..
నవీన్ యాదవ్ 9553; మాగంటి సునీత 6615; దీపక్ రెడ్డి: 1666
ఏడో రౌండ్..
నవీన్ యాదవ్ 9939; మాగంటి సునీత 5939; దీపక్ రెడ్డి: 1688
8వ రౌండ్..
8వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్ - 1876 ఓట్ల ఆధిక్యం
8 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం - 21,495 ఓట్లు
9వ రౌండ్..
9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం
ముగిసేసరికి 23,612 ఓట్ల ఆధిక్యం












Click it and Unblock the Notifications