లవర్స్ వీడియో తీసిన పోకిరీ, యువతిని బంధించిన అన్న, దొంగిలించి సమాజసేవకు
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ పోకిరీ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో కలిసి ఉన్న జంటలను అతను వీడియో తీస్తున్నాడు. ఆ వీడియోలతో జంటలను బెదిరిస్తున్నాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు నర్సింగ్ అని తెలుస్తోంది.
18 ఏళ్ల యువతిని ఇంట్లో బంధించిన అన్నావదిన
18 ఏళ్ల భవానీ అనే యువతిని ఆమె అన్నావదినలు మూడు రోజులుగా ఇంట్లో బంధించారు. ఈ విషయం బాలల హక్కుల సంఘానికి తెలిసింది. వారు భవానీని విడిపించారు. మూడ్రోజులుగా నేరేడ్మెట్‌లోని నివాసంలో బంధించారు.
ఉద్యోగాల పేరుతో టోకరా

పంజాగుట్టలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు యాభై మంది నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. మోసపోయిన నిరుద్యోగులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీ ఎండీ వెంకట సిద్ధయ్య, హెచ్‌ఆర్ వెంకట అవినాష్‌లను అరెస్ట్ చేశారు.
దొంగ అరెస్టు
భాగ్యనగరంలో చోరీలకు పాల్సడుతున్నదొంగను చిక్కడపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న ఎల్లయ్య సంపన్నుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుండేవాడు.
దొంగింలించిన సొమ్మును సమాజ సేవకు వినియోగించేవాడని డీసీపీ వివరించారు. ఇతని నుంచి రూ.12లక్షలు విలువచేసే సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలిపారు. ఇతనిపై నగరంలో వివిద పోలీస్ స్టేషన్లలో 139 కేసులు నమోదయ్యాయని సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications