బీరు చల్లగా లేదని రచ్చ: 'సీఎం గన్‌మెన్' అంటూ హంగామా!..

బీరు చల్లగా లేదని రచ్చ: 'సీఎం గన్‌మెన్' అంటూ హంగామా!..

హైదరాబాద్: సహచరులతో కలిసి ఓ బార్‌లో మద్యం సేవించడానికి వెళ్లిన వ్యక్తి.. అక్కడ సిబ్బందితో నానా రచ్చ చేశాడు. పైపెచ్చు తాను సీఎం గన్ మెన్ అని, తనకే ఎదురుచెబుతారా అని వాళ్లపై దాడి చేశాడు. ఎందుకిదంతా జరిగిందంటే.. కేవలం బీరు చల్లగా లేదన్న కారణంతో అతగాడు సిబ్బందిపై విరుచుకుపడ్డాడట. విషయం పోలీసుల దాకా వెళ్తే గానీ తెలియలేదు సదరు వ్యక్తి సీఎం గన్ మెన్ కాదు ఐజీ గన్‌మెన్ అని.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం నాడు జనార్దన్ అనే కానిస్టేబుల్ కొంతమంది స్నేహితులతో కలిసి మేడిపల్లి బోడుప్పల్‌ రోడ్డులో ఉన్న స్వాగత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కి వెళ్లాడు. బీర్ కావాలని ఆర్డర్ చేయగా.. బీర్ బాటిల్స్ తీసుకొచ్చి సిబ్బంది వాటిని టేబుల్స్ పై పెట్టారు. అయితే బీరు చల్లగా లేదన్న కారణంగా కానిస్టేబుల్ వారితో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలంతో వారిని దూషించాడు.

Constable attack on Bar shop at uppal

'ఏమనుకుంటున్నార్రా నన్ను.. సీఎం గన్‌మెన్ ను నేను' అంటూ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు వారిపై చేయి కూడా చేసుకోవడంతో విషయం మరింత పెద్దదయింది. ఇంత చేసి సిబ్బంది పైనే జనార్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గొలుసు కొట్టేశారని ఆరోపించాడు. దీంతో పోలీసులకు బార్ వద్దకు చేరుకుని సీసీటీవి ఫుటేజీని పరిశీలించారు.

బార్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుటేజీలో జనార్దన్ చేసిన దాడి స్పష్టంగా రికార్డవడంతో అతనితో పాటు అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని ఐఎస్ డబ్ల్యూ కానిస్టేబుల్ గా గుర్తించారు. ప్రస్తుతం అతను ఐజీ గన్ మెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+