కానిస్టేబుల్‌కు అప్పటికే పెళ్లి: ఫ్రెండ్ మరదలితో కాపురం చేసి గర్భవతిని చేశాడు
సంగారెడ్డి: స్నేహితుడి మరదలినిమోసం చేసి దొంగ పెళ్లి చేసుకొని చిత్తగించాడు ఓ కానిస్టేబుల్. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ పాండురాజు, ఆనంద్ ఇద్దరూ స్నేహితులు.
పాండురాజు మొదటి భార్యతో గొడవపడి బీబీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బీబీ చెల్లెలు ఫరీనా కూడా జోగిపేటకు వచ్చి పాండు రాజు వద్ద ఉంటోంది. ఈ సమయంలో ఆనంద్ కన్ను ఫరీనాపై పడింది.మాయమాటలతో ఆమెను లోబరుచుకున్నాడు. ఫరీనా గర్భం దాల్చడంతో ఆనంద్‌ను నిలదీశారు. చేసేది లేక ఆనంద్ ఫరీనాను వివాహం చేసుకున్నాడు.
కొంతకాలం ఆమెతో కాపురం చేసిన ఆనంద్ ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో ఫరీనా జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న పాండురాజు ఇంటికి తరుచుగా ఆనంద్ వస్తుండేవాడు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా చనువుగా మారింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆనంద్ ఇంటికి వచ్చి, ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కాదని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
కొన్నాళ్ల పాటు ఇలాగే వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగించగా, ఆ యువతి యువతి గర్భం దాల్చింది. దీంతో ఆనంద్‌ను నీలదీయగా మండల పరిధిలోని కిచ్చన్పపల్లిలోని శ్రీ వేంకటేశ్వర దేవస్థానంలో ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగింది. తరువాత జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడు.
తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. ఫోన్ చేసిన స్పందించకపోవడంతో తనను మోసం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితురాలు జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ విషయమై విచారణ చేసిన తరువాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపించిన తరువాతనే చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని సీఐ నాగయ్య తెలిపారు. సీసీఐ కానిస్టేబుల్ ఆనంద్, టేక్మాల్ హెడ్‌కానిస్టేబుల్ పాండురాజులకు మధ్య ఆర్థిక లావాదేవీలతో విబేధాలు ఉన్నాయని, తద్వారానే తన మరదలతో ఆనంద్‌పై ఫిర్యాదు చేయిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications