గన్ మిస్ ఫైర్ : ప్రభుత్వ విప్ ఓదెలు సెక్యూరిటీ మృతి
మందమర్రి : ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వద్ద వ్యక్తిగత సెక్యూరిటీగా పనిచేస్తున్న గంగాధర్ అనే కానిస్టేబుల్, గన్ మిస్ ఫైర్ అవడంతో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఉదయం నల్లాల ఓదెలు ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న కానిస్టేబుల్ గంగాధర్, గన్ ను క్లీన్ చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గన్ పేలడంతో మృతి చెందినట్టుగా సమాచారం. గంగాధర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్త స్రావమైంది.

కాగా.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కానిస్టేబుల్ గంగాధర్ ను రామక్రిష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో గంగాధర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications