ఆ పోలీసుకు భార్యాపిల్లలున్నారు: పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని తీసుకెళ్లాడు

అతనో పోలీసు. అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. అయితే ఓ అమ్మాయిపై మనసు పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు.

హైదరాబాద్: తన కూతురు వయసు గల అమ్మాయిపై ఓ కానిస్టేబుల్ మనసు పడ్డాడు. ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఐదురోజుల పాటు పలు చోట్ల తిప్పాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు.

హైదరాబాదులోని కామాటిపుర పోలీస్‌స్టేషన్‌లో మహబూబ్‌(48) హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తు న్నాడు. అతడికి భార్య, పిల్లలున్నారు. ఇటీవల ఒక కూతురు పెళ్లి చేశాడు. మరో కూతురి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, తన కన్నా 33 ఏళ్ల చిన్నదైన బాలికను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తాను పనిచేసే పోలీసు స్టేషన్ ప్రాంతంలోనే ఆమె ఇల్లు ఉంది.

Constable eyes on a girl, wanted to marry her

ఆమె తల్లిదండ్రులను కోల్పోయి సోదరి ఇంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉన్న సమయంలో అతను బాలికను ప్రేమగా పలకరించేవాడు. మాటలు చెబుతూ ఆమెకు చేరువయ్యాడు. ఈనెల 2వ తేదీన పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఖరీదైన కారులో ఆమెను తీసుకుని ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.

దీనిపై బాలిక సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెడ్‌ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. బాలిక ఇష్టపడడం వల్లనే ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తీసుకెళ్లినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడని సమాచారం.

కాగా, చట్టం దృష్టిలో అందరూ సమానేమనని..హెడ్‌కానిస్టేబుల్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేశామని సౌతజోన్‌ డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు. బాలికకు వైద్యపరీక్ష లు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+