కామరెడ్డి లో గన్ మిస్ ఫైర్ ... మిస్ ఫైర్ అయిందా లేక కాల్చుకున్నాడా ?
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం కామారెడ్డి లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ చేతిలోతుపాకి మిస్ ఫైర్ అయింది. దీంతో ఆ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన చెందిన శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కానిస్టేబుల్ ను కామారెడ్డి అసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్దకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో శ్రీనివాస్ చేతిలో గన్ మిస్‌ఫైర్ అయిందా...లేక అతనే కాల్చుకున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications