కోర్టు ఆవరణలోనే వివాహితపై అత్యాచారయత్నం,నిందితుడిని ఇలా...
భర్త నుండి విడిపోయిన ఓ వివాహిత మనోవర్తి కోసం కోర్టును ఆశ్రయించింది.అయితే కోర్టు ఆవరణలోనే ఆమెపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
నారాయణపేట:చట్టాన్ని రక్షించాల్సిన రక్షక భటుడే చట్టాన్ని అతిక్రమించాడు. కోర్టు ఆవరణలోనే ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్ గ్రామానికి చెందిన గిరిజ అలియాస్ వనజ భర్త వదిలేశాడు.అయితే ఆమె తన భర్త నుండి మనోవర్తి కోసం కోర్టును ఆశ్రయించింది.

నారాయణపేట కోర్టులో కేసు వాయిదా కోసం ఆమె వచ్చింది. మంగళవారం నాడుఆమె నారాయణపేట కోర్టు నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా పోలీస్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
కోర్టు మెట్ల కింద ఖాళీ స్థలం వైపు బాధితురాలని లాక్కెల్ళాడు.ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.దీంతో బాధితురాలు వెంటనే న్యాయమూర్తి సాయికుమార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
కానిస్టేబుల్ రామాంజనేయులును ఎస్ పి కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టుగా డిఎస్ పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications