హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐసీయూలో వెంటిలేటర్‌పై సూపర్ స్టార్ కృష్ణ - 24 గంటల తరువాతే: హాస్పిటల్ ఎండీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. 24 గంటల తరువాతే ఆయన ఆరోగ్యంపై ప్రకటన వెలువడిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన స్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు.

 కాంటినెంటల్‌లో..

కాంటినెంటల్‌లో..


ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండెనొప్పితో బాధపడిన ఆయనను కోడలు నమ్రత శిరోద్కర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి అత్యాధునిక చికిత్సను అందించారు. డాక్లర్లు సత్వర చికిత్సను అందించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్షేమంగా రావాలంటూ..

క్షేమంగా రావాలంటూ..

కృష్ణ ఆసుపత్రిలో చేరారనే వార్త దావానలంలా వ్యాపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఆసుపత్రి నుంచి రావాలంటూ ప్రార్థనలు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. #SuperStarKrishna అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్ కింద వేలాది పోస్టులు పడుతున్నాయి.

వెంటిలేటర్‌పై..

వెంటిలేటర్‌పై..

ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి తాజా సమాచారాన్ని అందించారు. కొద్దిసేపటి కిందటే ఆసుపత్రిలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని వెల్లడించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

24 గంటల తరువాతే..

24 గంటల తరువాతే..


24 నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని, ఆ తరువాతే ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజా సమాచారాన్ని ఇవ్వగలుగుతామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిద్దామని వ్యాఖ్యానించారు. క్లిష్ట స్థితిలో ఉన్నారని స్పష్టం చేశారు. తాము అందించిన వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని, ఫలితంగా కొంతవరకు నిలకడగా ఉంటోందని వివరించారు. ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే 20 నిమిషాల పాటు సీపీఆర్ చేశామని తెలిపారు.

 కార్డియాక్ అరెస్ట్‌కు..

కార్డియాక్ అరెస్ట్‌కు..

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడానికి అవసరమైన ట్రీట్‌మెంట్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఏ పేషెంట్‌ ప్రాణాన్నయినా నిలపడానికి చిట్టచివరి వరకు తాము ప్రయత్నిస్తూనే ఉంటామని, చెయ్యాల్సినవన్నీ చేస్తామని డాక్టర్ వివరించారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడానికి చాలా కారణాలు ఉంటాయని, అలాంటి పేషెంట్లు కోలుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు.

English summary
Continental Hospital MD Dr. Guru N Reddy revealed that Superstar Krishna is being given in the ICU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X