కెసిఆర్ వరాలు: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, డిఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాంట్రాక్టు ఉద్యోగులకు, డిఎస్సీ ఆశావహులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆయన వరాలు ప్రకటించారు. కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 50 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. జనవరి 2న మంత్రివర్గ సమావేశంలో శాఖల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. 15 వేల నుంచి 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే టెట్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 10,961 ఖాళీలున్నట్లు అధికారులు హైకోర్టుకు తెలిపారు.
7,500 వరకు స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఇతర గురుకులాలతో కలుపుకుని మొత్తం 15 వేల నుంచి 20 వేల వరకు ఖాళీలున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టులన్నింటికీ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఉద్యమం సందర్భంగా వేలాది వినతి పత్రాలు వచ్చాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications