కాంట్రాక్ట్ మ్యారేజెస్: పాతబస్తీలో 16మంది అరబ్ షేక్‌లు, బ్రోకర్లు అరెస్ట్
కాంట్రాక్ట్ పెళ్లిళ్లతో అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న 8మంది అరబ్ షేక్‌లు, 8మంది బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video

హైదరాబాద్: కాంట్రాక్ట్ పెళ్లిళ్లతో పేద, అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న 8మంది అరబ్ షేక్‌లు, 8మంది బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ, చాంద్రాయణగుట్టలో కాంట్రాక్ట్ మ్యారేజీల కోసం అరబ్ షేక్‌లు వచ్చారన్న సమాచారంతో బ్రోకర్ల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ మ్యారేజీలకు సిద్ధంగా ఉన్న అరబ్ షేక్‌లపై ఆరా తీసి 8మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన 8మంది బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరంతా పేదంటి మైనర్లపై కన్నేసి, వారిని మభ్యపెట్టి వివాహాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కూడా ఓ దుబాయ్ షేక్ పాతబస్తీకి చెందిన మైనర్ బాలికను రూ. లక్షలు ఇచ్చి, వివాహం చేసుకుని అతని వెంట తీసుకెళ్లాడు.
కాగా, అక్కడ తాను చిత్రహింసలకు గురవుతున్నానని, తనను కాపాడాలని ఆ యువతి కుటుంబసభ్యులను ఫోన్లో వేడుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications