ఆత్మహత్య చేసుకుంటా: 12 అంతస్థుల బిల్డింగ్ పైకెక్కి హల్‌చల్, మీడియాపై దాడి

హైదరాబాద్: కూకట్‌పల్లిలో శ్రీను అనే కాంట్రాక్టర్ 12 అంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి హంగామా సృష్టించాడు. తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఓ భవన యజమాని ఇవ్వడం లేదని అందుకే ఇలా చేస్తున్నానని ఆరోపించాడు.

శ్రీను చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తుంటాడు. హిమానీ అపార్టుమెంటులోను పనులు చేశానని చెబుతున్నారు. తనతో పనులు చేయించుకున్నాక హిమానీ అపార్టుమెంటు యజమాని బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ శ్రీను 12 అంతస్తుల భవనంతిని ఎక్కాడు. తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

Contractor climbs 12 storey building for dues

తనను వేధిస్తున్న వ్యక్తి పైన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అతను ఆరోపించాడు. కాగా, అక్కడకు వచ్చిన మీడియా కెమెరాలను చూసిన అపార్టుమెంట్ వాసులు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారని తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పరిస్థితి చక్కదిద్దుతున్నారు.

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసులు అదివారం అరెస్టు చేశారు. నాయక్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా రామచంద్రాపురం, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+