అదానీ‌తో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. యాదవరెడ్డి రాసిన 'నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్' పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమన్నారు.గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఒక్క సంతకంతో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు.

Contracts with Adani cannot be canceled immediately Revanth Reddy

అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రెండు వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దీనిపై మాట్లాడేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదన్నారు. భారత్ కోల్పోయిన భూమి, మణిపూర్ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.మోదీ ప్రధాని అయ్యాక ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని ఆరోపించారు. ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+