భవిష్యత్తులో అంతా సుఖమే అన్నది: రాజేష్, గౌరవం కోసమూ స్వాతి ప్లాన్, కనిపించని పశ్చాత్తాపం
నాగర్‌కర్నూలు/హైదరాబాద్: సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అంతకుముందు నాగర్ కర్నూలు పోలీసులు సీన్ ఆఫ్ ఎఫెన్సును రీక్రియేట్ చేశారు.
చదవండి: భర్తను రోకలిబండతో కొట్టి, రాజేష్‌కు సైగ చేసి: స్వాతి కిరాతకం, 'జైలు నుంచి వచ్చినా నో'
రాజేష్‌ను ఫతేపూర్ అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ సుధాకర్ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాబట్టారు. ఆ ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్, పెట్రోలు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎన్నో విషయాలను రాబట్టారు.
చదవండి: గుట్టువిప్పిన రాజేష్, బలమైన సాక్ష్యాలు: 'అలాంటి స్వాతి ఇలా చేసిందా'

విలేకరుల ప్రశ్నకు రాజేష్ సమాధానం
ముఖం కాలుతున్నపుడు బాధగా అనిపించిందని, ఇప్పడు కొంత బాధ అనుభవిస్తే, భవిష్యత్తులో అంతా సుఖాన్నే పొందవచ్చని స్వాతి చెప్పిందని, ఇద్దరం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశామని, భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తాగి వచ్చి కొడుతున్నాడని తనతో చెప్పి బాధపడేదని, మనమిద్దరం సుఖంగా ఉండాలంటే సుధాకర్ రెడ్డి మధ్యలో ఉండరాదని స్వాతి చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డామని రాజేష్ చెప్పాడు. వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజేష్ సమాధానం అది.

సుధాకర్ రెడ్డికి స్వాతికి బావ, ప్రేమించి పెళ్లాడింది
బండపల్లికి చెందిన స్వాతికి సుధాకర్ రెడ్డి వరుసకు బావ అవుతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగారు. సంసారం హాయిగా సాగుతున్న సమయంలో రాజేష్ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సుధాకర్ రెడ్డి లేని సమయంలో స్వాతి ఆ సమాచారం ఇస్తే రాజేష్ ఇంటికి వచ్చేవాడు. శారీరకంగా కలుసుకుంటూ, అవసరాలకు డబ్బు తీసుకుంటూ రాజేష్ బలాదూర్‌గా తిరిగేవాడు.

ఊరికేనే చంపేస్తే అనుమానమని, ఆస్తి-గౌరవం పోకుండా
భర్త సుధాకర్ రెడ్డిని ఊరికేనే చంపేస్తే అనుమానం వస్తుందని, స్వాతి తన భర్త స్థానంలోకి రాజేష్‌ను తీసుకు రావాలనుకుంది. భర్త స్థానంలో రాజేష్‌ను తీసుకొస్తే అనుభవిస్తున్న ఆస్తి చేజారకుండా సమాజంలో గౌరవానికి భంగం లేకుండా బతకొచ్చని భావించారు.

మీరే పడ్డారంటూ సర్ది చెప్పింది
హత్యకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో రాజేష్ ఇంట్లో ఉన్నప్పుడు స్వాతి లైట్ బంద్ చేసింది. రాజేష్ ఇనుపరాడ్డుతో కొట్టాడు. రాజేష్‌ను వెళ్లగొట్టింది. మీరే మంచంపై నుంచి పడ్డారంటూ భర్తకు సర్ది చెప్పి బంధువుతో ఆసుపత్రికి పంపించింది. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన సుధాకర్ రెడ్డి, బంధువు అరవింద్ రెడ్డి ఇంట్లో పడుకున్నారు. మరుసటిరోజు తెల్లవారుజామున అరవింద్ రెడ్డిని పంపించి, రాజేష్‌ను మళ్లీ పిలిపించి, ఇద్దరు కలిసి హత్య చేశారు.

స్వాతి ముఖంలో కనిపించని పశ్చాత్తాపం
ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను అడ్డు తొలగించుకున్న స్వాతిని శుక్రవారం కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆమెను మహిళా జైలు నుంచి ఆర్టీసీ బస్సులో తీసుకు వచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి అదే బస్సులో తిసుకు వెళ్లారు. గంటన్నరకు పైగా స్వాతి కోర్టులో ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications