Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తను రోకలిబండతో కొట్టి, రాజేష్‌కు సైగ చేసి: స్వాతి కిరాతకం, 'జైలు నుంచి వచ్చినా నో'

నాగర్‌కర్నూలు: భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్‌లకు న్యాయస్థానం శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇరువురికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పోలీసులు వారిని మహబూబ్ నగర్ జైలుకు తరలించారు.

Recommended Video

    అక్కడే దొరికిపోయారు.. విచారణలో షాక్ !

    పోలీసుల విచారణలో స్వాతి, రాజేష్‌లు ఎన్నో విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి బిజినెస్ టెన్షన్‌లో పలుమార్లు తనను కొట్టాడని స్వాతి విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు గురించి మాట్లాడారు.

    రేపు రమ్మని రాజేష్‌కు సైగ చేసింది

    రేపు రమ్మని రాజేష్‌కు సైగ చేసింది

    హత్యకు ముందు రోజు స్వాతి - సుధాకర్ రెడ్డిల మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఆమె తల మీద కొట్టిందని, అది నుదుటి మీద తాగిందని, భర్తకు గాయమైందని చెప్పారు. నువ్వు ఈ మధ్య బాగా తాగుతున్నావని ఆమె భర్తకు చెప్పింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రాజేష్‌తో నువ్వు ఇప్పుడు వెళ్లిపోయి రేపు రమ్మని సైగ చేసింది.

    భర్తను స్వాతి రోకలి బండతో కొట్టింది

    భర్తను స్వాతి రోకలి బండతో కొట్టింది

    ఆ తర్వాత బంధువును పిలిపించి భర్తను ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. మరుసటి రోజు ఉదయం రాజేష్‌ను పిలిపించుకుంది. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. సుధాకర్ రెడ్డి లేచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే రాజేష్ కొట్టాడు. ఆ తర్వాత స్వాతి రోకలి బండతో కొట్టింది. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బ్లాంకెట్లో చుట్టి కారులో తీసుకు వెళ్లారు.

    ఆ కారును సర్వీసింగ్‌కు ఇచ్చి

    ఆ కారును సర్వీసింగ్‌కు ఇచ్చి

    ఆ తర్వాత అదే కారులో తిరిగి వచ్చి దానిని సర్వీసింగ్‌కు ఇచ్చారు. మరో ప్రయివేటు కారు మాట్లాడుకొని పెట్రోలు బంకులో పెట్రోల్ కొన్నారు. ఇంటికి వచ్చాక రాజేష్ ముఖంపై చున్నీ పెట్టి పెట్రోలు పోసింది. కారులోనే మహబూబ్ నగర్ వెళ్తూ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసింది.

    కుటుంబ సభ్యులకు సమాచారం

    కుటుంబ సభ్యులకు సమాచారం

    ఇంట్లోకి ఎవరో నలుగురు చొరబడి భర్త సుధాకర్ రెడ్డిపై పెట్రోలు పోసేందుకు ప్రయత్నించారని సమాచారం అందించింది. దీంతో వారు వచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. రాజేష్‌ను సుధాకర్ రెడ్డిగా చెప్పి అడ్మిట్ చేసి, చికిత్స అందించింది.

    ఆస్తి ఎంజాయ్ చేద్దామనుకున్నారు

    ఆస్తి ఎంజాయ్ చేద్దామనుకున్నారు

    సుధాకర్ రెడ్డిలాగే అందరినీ నమ్మించి.. అతని ఆస్తిని కూడా ఎంజాయ్ చేద్దామని రాజేష్, స్వాతిలు భావించారని పోలీసులు చెప్పారు. బంధువులను అందరిని కూడా అలాగే నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పారు. కాగా, హత్యకు ముందే స్వాతి తన పిల్లలను తల్లి వద్దకు పంపించింది.

    స్వాతి తల్లిదండ్రుల ఆగ్రహం

    స్వాతి తల్లిదండ్రుల ఆగ్రహం

    తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ మమకారాన్ని కాదనలేక ఇంట్లోకి రానిచ్చామని, ప్రియుడితో కలిసి ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని, సమాజంలో తమ కుటుంబాన్ని తలెత్తుకోకుండా చేసిందని, తన కూతురు స్వాతి తమకు శవంతో సమానమని తల్లిదండ్రులు పద్మ, లింగారెడ్డి అన్నారు.

    జైలు నుంచి బయటకొచ్చినా రానీయం

    జైలు నుంచి బయటకొచ్చినా రానీయం

    తమ కూతురు స్వాతి జైలు నుంచి బయటకు వచ్చినా తాము దగ్గరకు రానీయమని చెప్పారు. మా అల్లుడు సుధాకర్ రెడ్డి చాలా మంచివాడు అని చెప్పారు. భర్తను పొట్టన పెట్టుకున్న పాపం ఊరికేపోదన్నారు. మా కన్న కూతురు ఇలాంటి నీచానికి దిగజారుతుందని ఊహించలేదని, మా దృష్టిలో మాకున్న ఒక్క కూతురు చనిపోయిందన్నారు. సుధాకర్ రెడ్డి తల్లి మాట్లాడుతూ.. తనకు గర్భ శోకాన్ని మిగిల్చిన స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్‌లను సజీవదహనం చేయాలన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+