అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తాజా షాక్..! ఇక వారందరికీ చెక్..!

అమెరికాలో పుట్టారన్న కారణంగా ఆటోమేటిగ్గా పౌరసత్వం (Birth Right Citizenship) ఇచ్చేందుకు ఉన్న నిబంధనల్ని కాలరాస్తూ ముందుకెళ్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మరోసారి తన తెంపరితనాన్ని బయటపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడి సుప్రీంకోర్టు జన్మతః పౌరసత్వం ఇవ్వాల్సిందేనని 6-3 మెజార్టీతో తీర్పు ఇచ్చినా, దాన్ని పరోక్షంగా అధిగమించేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా విదేశీయులకు ఆటోమేటిగ్గా అమెరికా పౌరసత్వం లభించకుండా మరో కార్యనిర్వాహక ఆదేశంపై ట్రంప్ సంతకం చేశారు.

US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?
US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?

అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించకుండా అడ్డుకునేందుకు ట్రంప్ తాజాగా రెండు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఆరు వారాల క్రితం ఇలా పౌరసత్వాన్ని అడ్డుకోవడం కుదరదని తేల్చిచెప్పేసినా.. పరోక్ష మార్గాల ద్వారా పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశంలో జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ హక్కును రద్దు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్.. దీనిపై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Trump Makes Fresh Push to End Birthright Citizenship with Second Executive Order
UPI ఛార్జీల మోత వెనుక ట్రంప్ ? షాకింగ్ రీజన్..!
UPI ఛార్జీల మోత వెనుక ట్రంప్ ? షాకింగ్ రీజన్..!

ఈ నేపథ్యంలోనే జూన్ నెలలో సుప్రీంకోర్టు కూడా ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు చాలా అన్యాయమైనదని, దాని వల్ల దేశం నష్టపోతోందని, అందుకే ఇప్పుడు భిన్నమైన మార్గంలో దీనికి ముగింపు పలుకుతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, అమెరికా శత్రు దేశాల ప్రజలు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యులు లేదా నిర్దేశిత విదేశీ ప్రభుత్వ ప్రతినిధులకు అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం లభించదు. అలాగే రెండో ఉత్తర్వు కేవలం ప్రసవం కోసమే విజిటర్ వీసాలపై అమెరికా వచ్చే బర్త్ టూరిజంను అడ్డుకునేలా రూపొందించారు. వీసా దరఖాస్తు సమయంలో ప్రయాణ అసలు ఉద్దేశాన్ని దాచడం మోసపూరిత చర్యగా పరిగణించి, వారి ప్రవేశాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+