టీమిండియాకు డబుల్ బ్లో: శుభ్‌మన్ గిల్ అవుట్- కేప్టెన్ గా.. !!
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్ తొలి రోజు ఆటకు కేప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం అయ్యాడు. గురువారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో అతని కుడిచేతి వేలికి గాయమైంది. దీంతో తొలి రోజు మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు.
ఈ నెల 15 నుంచి గాలే స్టేడియం వేదికగా భారత్-లంక జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో గిల్ విషయంలో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. గిల్ గాయం తీవ్రతను అంచనా వేసిన బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచింది. దీని తీవ్రత ఆధారంగా మిగిలిన రెండు రోజుల వామప్ లో ఆడేది లేనిదీ తేలుతుంది.

కొలంబోలో గురువారం జరిగిన ఫిజికల్ ట్రైనింగ్ సమయంలో గిల్ రెండుసార్లు గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్‌లో పేసర్ గుర్నూర్ బ్రార్ వేసిన డెలివరీని ఎదుర్కొనే క్రమంలో గాయపడ్డాడు. ఆ బంతి.. అతని కుడిచేతికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడాడు గిల్. ఫిజియో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత కొంతసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో కూడా అతని వేలికి గాయమైంది.
ఓ క్యాచ్ ను అందుకునే సమయంలో మరోసారి బంతి అదే వేలికి బలంగా తాకింది. దీంతో గిల్‌కు ఐస్ ప్యాక్ పెట్టి ఉపశమనం కల్పించారు. వేలిపై వాపు కనిపించడం, చర్మం కొద్దిగా చిట్లడం వంటి పరిణామాల నేపథ్యంలో వామప్ మ్యాచ్ మొదటి రోజు ఆటకు దూరం అయ్యాడు. విశ్రాంతి తీసుకుంటోన్నాడు. గిల్. లంక పిచ్ పరిస్థితులకు సర్దుబాటు అయ్యేందుకు గిల్‌కు ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్ ఎంతో ఉపయోగపడేది.
ఇప్పటికే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా కూడా గాయాల కారణంగా ఈ జట్టుకు అందుబాటులో లేరు. ఓపెనర్ సాయి సుదర్శన్ సైతం ప్రస్తుతం కాలివేలి గాయం నుంచి కోలుకుంటోన్నాడు. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. రెండు రోజుల్లో గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంి. రికవరీ ఆలస్యమైతే మాత్రం గాలే టెస్ట్ కు కేఎల్ రాహుల్ సారథ్యం వహించే అవకాశం ఉంటుంది.




Click it and Unblock the Notifications