జగన్ కు ముప్పు, కేంద్రానికి ఫిర్యాదు - అమిత్ షా స్పందన..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ వ్యవహారాల పై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటన వేళ భద్రత ఇవ్వటం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా దేవరపల్లి లో జగన్ పర్యటన సమయంలో పోలీసు సిబ్బంది లేకపోవటాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశం పైన తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. జగన్ కు ముప్పు ఉందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు.
మాజీ సీఎం జగన్ భద్రత కు ముప్పు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే భద్రత కల్పించటం లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత పైన వైసీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ... అమిత్ షా తో పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా కు తాము అన్ని విషయాల గురించి వివరించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పైన జగన్ పోరాట క్రమంలో భాగంగా జిల్లాకు వెళ్లిన సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఈ స్పందన చూసి.. ఉద్దేశ పూర్వకంగానే జగన్ కు భద్రత కల్పించటం లేదని ఆరోపించారు.

అమిత్ షాకు వైసీపీ ఎంపీల ఫిర్యాదు
అదే విధంగా భారతీ సిమెంట్స్ ను వేధిస్తూ.. కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. లాకప్ డెత్ లు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీక్ పైన సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు తెలిపారు. బిల్లు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. జగన్ కు భద్రత లేకపోవటంపైన ఫాటోలతో సహా అమిత్ షాకు వివరించామని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం విషయాలను పరిశీలన చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని సుబ్బారెడ్డి వెల్లడించారు. కాగా.. అటు కూటమి మంత్రులు మాత్రం జగన్ పర్యటనలో చోటు చేసుకుంటున్న ఘటనల పైన విమర్శలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications