శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల దాదాపు రూ. 26 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర ఈ కొకైన్ ను పట్టుకున్నారు. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది.

విదేశాలనుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు దాదాపు కేజిన్నర బంగారాన్ని ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన అక్రమ బంగారాన్ని డొమెస్టిక్ ప్రయాణికుడికి అందించే ప్రయత్నం జరుగుతోందని పక్కా సమాచారం రావడంతో ఎయిర్ పోర్ట్ లోని డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు.

ఈ మేరకు తిరుచ్చి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ కు వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో భాగంగా అతడి వద్ద రూ.2.25 కోట్ల విలువైన 1,481.780 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కెట్లను లగేజీ బ్యాగ్‌ లో దుస్తుల కింద దాచి నిందితుడు అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారాన్ని ఆరు ముక్కలు గా కార్మన్ పేపర్ తో చుట్టు దానికి నీలిరంగు టేప్ వేసి లోదుస్తుల్లో దాచినట్టు తెలిపారు.

Shamshabad Airport Illicit gold worth Rs 2 25 crore seized Shamshabad Airport Illicit gold seized

ఈ క్రమంలో నిందితుడి అరెస్ట్ చేసి కస్టమ్స్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే విదేశాల నుంచి డొమెస్టిక్ రూట్‌ లో బంగారం తరలిస్తున్న ముఠా గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి డ్రగ్స్, అక్రమ బంగారం రవాణా కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇది రెండో ఘటన కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+