కరోనా కన్నెర్ర.!నగరంలో తెరుచుకోని ప్రఖ్యాత రెస్టారెంట్లు.!బావురుమంటున్న భోజన ప్రియులు.!
హైదరాబాద్ : భిన్న సంస్కృతుల సమాహారంగా కొనసాగుతున్న హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. చల్లని వాతావరణం, ఉర్దూను కలుపుతూ మాట్లాడే హిందీ భాష, విశాలమైన ఫ్లైఓవర్లు, నిత్యం ఆకర్శించే ఛార్మినార్ వంటి పురాతన కట్టడాలు, ఆహ్లదంగా ఆహ్వానం పలికే హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు ఎక్కడా దొరకని కమ్మని ధమ్ టీ, రుచికరమైన వంటకాలే కాకుండా ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యంత సువాసనల, రుచికరమైన బిర్యాని కూడా హైదరాబాద్ నగరంలో దొరకడం విశేషం.
ప్రజల అభిరుచులకు అనుగుణంగా నగరంలో అనేక రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లు వెలిసాయి. అవన్నీ కూడా భోజన ప్రియుల ప్రశంసలను అందుకున్నాయి. కాని కరోనా మహమ్మారి వల్ల ఇలాంటి ప్రజాధరణ పొందిన రెస్టారెంట్లు చాలావరకు తెరుచుకోని పరిస్థితులు నెలకొన్నాయి.

పేరొందిన రెస్టారెంట్లకు కరోనా దెబ్బ..
పెరుగుతున్న ఉద్యోగావకాశాలకు తోడు మౌళికసదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం ఊహించని వేగంతో ముందుకెళ్తోంది. ఐటీ రంగంతో పాటు ఉపాది అవకాశాలు ఎక్కువగా ఉండే నగరంలో జనాబా కూడా వేగంగా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయారు. 2000సంవత్సరం నుండి నగరంలో ఐటి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పటు సినిమా పరిశ్రమలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల నగరంలో జనాబా ఊహించని స్థాయిలో పెరిగిపోయారు. పెరిగిన జనాబా అవసాల ప్రకారం నగరంతో పాటు దాని పరిసరాలు కూడా వేగంగా అభివృద్ది సాధించాయి. అంతే కాకుండా భిన్న సంస్కృతుల ప్రజల మనోభావాలకనుగుణంగా అనేక వసతి సౌకర్యాలతో పాటు రెస్టారెంట్లు కూడా పుట్టుకొచ్చాయి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ బిర్యాని..
గ్లోబలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరంలో రుచికరమైన భోజన పదార్థాల తయారీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నగరంలో లభించే బిర్యానీ, ధమ్ కా బిర్యానిలో తయారీ, దానిలో ఉన్న రుచి ప్రపంచంలో ఎక్కడా దొరకదనే ప్రచారం కూడా ఉంది. లక్షల సంఖ్యలో బిర్యానీ పార్సిళ్లు విధేశాలకు ఎగుమతి చేయడం ద్వారా హైదరాబాద్ బిర్యానీకి ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నగరంలో లక్షల సంఖ్యలో భోజన ప్రియులు రెస్టారెంట్లలో బిర్యానీని ఆస్వాదించడం ఆనవాయితీగా వస్తున్నఆచారం. బిర్యాని తయారీలో నగరంలో కొన్ని రెస్టారెంట్లకు ప్రత్యేక బ్రాండ్ కూడా ఉండడం విశేషం.

తెరవాలా వద్దా..?
బావర్చి, ప్యారడైజ్, పిస్తా హౌస్, సదా బహార్, అల్ సబా, షాఘౌస్, బార్బిడాల్, కృతింగ, రాయలసీమ రుచులు, ఉలవచారు, చట్నీస్, షాన్ బాగ్ వంటి రెస్టారెంట్లలో లభించే బిర్యాని కోసం జనాలు బారులు తీరి మరీ బిర్యానిని ఆరగిస్తుంటారు. ఇవే కాకుండా సాధారణ భోజనం లభించే కాకతీయ మెస్, హర్హ, అపూర్వ, అరటాకు వంటి పేరొందిన హోటళ్లు కూడా కరోనా మహమ్మారి కారణంగా ఇంకా తెరుచుకోని సందర్బాలు కనిపిస్తున్నాయి.ఇంట్లో భోజనం తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి, కాస్త బద్దకం అనిపిస్తే పిల్లా పాపలతో ఇలాంటి రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు నగర ప్రజలు. ప్రస్తుతం కరోనా వైరస్ ఇలాంటి రెస్టారెంట్లకు శరాఘాతంగా పరిణమించింది.

బయట భోజనం వద్దు.. ఇంటి వంటే ముద్దు..
గత 30, 40సంవత్సరాలకు పైగా ప్రజల మన్ననలను పొందుతూ రెస్టారెంట్ వ్యాపారంలో దూసుకెళ్తున్న యాజమాన్యాలు కరోనా వైరస్ ధాటికి కకావికలం అవుతున్న సందర్బాలు తలెత్తాయి.కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ అంక్షల నేపథ్యలో ఈ రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి. ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో యాజమాన్యాలు రెస్టారెట్లను తెవరడంలో వెనకడుగు వేస్తున్నాయి. దాంతో పాటు కరోనా వైరస్ పట్ల ప్రజల్లో వచ్చిన చైతన్యంతో రెస్టారెంట్ వ్యాపారం కుదేలయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల సాధారణ కర్రీ పాయింట్లు, మెస్సులకే జనాలు వెళ్లడం మానేసారు. ఇక రెస్టారెంట్లను గతంలో ఆదరించినట్టు ఇప్పుడు ఆదరిస్తారా అన్నదే ప్రశ్నార్దకంగా మారింది. దీంతో నగరంలో చాలా ప్రసిద్ది చెందిన రెస్టారెంట్లు తెరవాలా వద్దా అనే సంధిగ్దంలో ఉన్నట్టు తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications