Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జార్జియా నుంచి వచ్చాక కమెడియన్ ప్రియదర్శి హౌజ్ అరెస్ట్..శభాష్ అంటున్న నెటిజెన్లు

హైదరాబాద్ : కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 7వేలకు పైగా మృతి చెందారు. ఇక చైనా నుంచి ఇటలీ ఇరాన్‌ దేశాలతో పాటు భారత్‌లోకి ప్రవేశించింది ఈ మహమ్మారి. ఇప్పటికే భారత్‌లో కరోనావైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఢిల్లీలో మృతి చెందగా మరొకరు కర్నాటకలో చనిపోయాడు. మహమ్మారిని జయించేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అటు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అంతేకాదు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలువురు సెలిబ్రిటీలు కూడా రంగంలోకి దిగి తమవంతు సహాయం చేస్తున్నారు. కరోనావైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతన్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌లు ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది.

తాజాగా కమెడియన్ ప్రియదర్శి కూడా కరోనావైరస్ గురించి స్పందించారు. ముందుగా ప్రజల్లో అవగాహన తెచ్చేముందు తను ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ మధ్యే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్‌లో జార్జియాలో పూర్తి చేసుకుని భారత్ తిరిగి వచ్చిన స్టార్ కమెడియన్ ప్రియదర్శి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. తనను తాను సెల్ఫ్ అరెస్టు చేసుకుని ఒక ప్రత్యేక గదిలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌కు చెబుతూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ప్రియదర్శి శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే అధికారులు కరోనావైరస్ స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం నేరుగా ఇంటికెళ్లి అక్కడే తనకు తానుగా హౌజ్ అరెస్ట్ అయిపోయాడు. ప్రియదర్శి తీసుకున్న నిర్ణయంపై నెటిజెన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బాధ్యతగా ఫీలైనందుకు నెటిజెన్లు శభాష్ అని కొనియాడుతున్నారు.

Coronavirus:Comedian Priyadarshi self arrested in house for 14 days after returning from Georgia

శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే ప్రియదర్శికి కరోనావైరస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు తనకు ఎలాంటి వైరస్ లేదని నిర్థారించి అయినప్పటికీ విదేశాల నుంచి వచ్చినందున 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించడంతో ప్రియదర్శి బాధ్యతగా వైద్యుల ఆదేశాలను పాటిస్తున్నాడు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని తాను భావించినట్లు చెప్పిన ప్రియదర్శి.. కొన్ని రోజుల పాటు సోషల్ లైఫ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు ట్విటర్ ద్వారా చెప్పాడు. కరోనా వైరస్ అంటే కంగారు పడాల్సిన పనిలేదని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని చెప్పుకొచ్చాడు ఈ అప్‌కమింగ్ స్టార్ కమెడియన్.

Recommended Video

    CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions

    కొద్ది రోజుల క్రితం జార్జియాలో షూటింగ్ కోసమని వెళ్లిన ప్రియదర్శి ఓ ట్వీట్ చేశాడు. తాను జార్జియాలో ఉన్నట్లు ఫ్యాన్స్‌కు చెప్పిన ప్రియదర్శి ఇక్కడ రోడ్లన్నీ కరోనావైరస్ భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయని వెల్లడించాడు. విమానాశ్రయం కూడా ఖాళీగా ఉందని చెప్పాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+