అవినీతి: జగిత్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అరెస్ట్, 20రోజుల రిమాండ్
జగిత్యాల: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగిత్యాల మొదటి శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ మధును అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు ఆదేశంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటలకు జగిత్యాల శ్రీరామా చౌరస్తాలోని మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్లారు.
ఇంట్లో సోదాలు జరపగా లెక్కలు చూపని రూ. 4.20 లక్షల నగదు, ఓ కేసులో డిపాజిట్ చేసిన ఆరు మొబైల్ ఫోన్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు ఖాతాలు పరిశీలించగా అందులో రూ. 2 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి లెక్కలు ఉండటంతో కేసులో చూపలేదు.

ఏసీబీ అదనపు ఎస్పీ మాదాడి రమణకుమార్, డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో 8 మంది సీఐలు సోదాల్లో పాల్గొన్నారు. కేసు కొట్టి వేసేందుకు న్యాయవాది చీటి రామక్రిష్ణారావు కేసులో రూ. 10 వేలు, న్యాయవాది కొండపల్కల వెంకటేశ్వర్‌రావు కేసులో రూ. 50 వేలు మెజిస్ట్రేట్ మధుకు ఇచ్చినట్లు తేలిందని ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ చెప్పారు.

కాగా, శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హైకోర్టు అనుమతి, ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి కేసులో అరెస్టయిన జగిత్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మధును కరీంనగర్ జైలుకు తరలించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం రాత్రి 11.15 గంటలకు కరీంనగర్‌లోని ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు మధుకు ఏప్రిల్ 20 వరకు రిమాండ్ విధించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications