ఆవేశంలోనే, చంపేందుకే: మధుప్రియ కేసులో ట్విస్ట్‌లు, సుఖాంతానికి కౌన్సెలింగ్
హైదరాబాద్: గాయని మధుప్రియ కేసులో కొత్త ట్విస్ట్! తన భర్త శ్రీకాంత్ పైన ఆవేశంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ వేధింపులు రోజు రోజుకు ఎక్కువయ్యాయని, దీంతో అతని పైన ఫిర్యాదు చేయవలసి వచ్చిందని చెప్పారని తెలుస్తోంది.
శ్రీకాంత్‌ను అరెస్టు చేస్తే తనకు బాధగానే ఉంటుందన్నారు. ఇరుపక్షాల కుటుంబ పెద్దలు మాట్లాడితే మరోసారి కలిసి ఉండే విషయంలో ఆలోచిస్తానని చెప్పారు. శ్రీకాంత్ మంచిగా ఉంటాడని తనకు నమ్మకం లేదన్నారు. శనివారం రాత్రి మా కుటుంబ సభ్యులను చంపేందుకే కత్తులతో తమ ఇంటికి వచ్చాడని ఆమె ఆరోపించారని తెలుస్తోంది.
మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంటా
అంతకుముందు ఓ టీవీ ఛానల్‌తో శ్రీకాంత్ మాట్లాడుతూ... కత్తులతో దాడి చేసేందుకు తాను వారి ఇంటికి వెళ్లానని మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను ప్రాణం తీసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని శ్రీకాంత్ చెప్పాడు.

మధుప్రియ చెప్పే మాటలు నిరూపిస్తే జీవితంలో ఆమెకు నా ముఖం చూపించనన్నాడు. తాను ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించానని, వాళ్ల అమ్మ, బావలకు ఫోన్ చేశానని చెప్పాడు. తనను ఫీవర్ ఆసుపత్రికి రమ్మని చెప్పారని, అక్కడి నుంచి ఇంటికి రమ్మన్నారని, అక్కడ వాళ్ల అమ్మ పై నుంచి కర్రతో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో కొట్టించిందని ఆరోపించాడు. తాను ఆస్తి లేదా కట్నం కోసం ఇబ్బంది పెట్టలేదన్నాడు.
విడివిడిగా, కలిపి.. పోలీసుల కౌన్సెలింగ్
మధుప్రియ, శ్రీకాంత్‌లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం, తన భార్యను తనకు అప్పగించాలని, తనతో తీసుకువెళ్తానని చెబుతూ శ్రీకాంత్.. హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్‌లోనే కూర్చున్నాడు.
ఆపై విషయాన్ని మధుప్రియకు చెప్పిన పోలీసులు కౌన్సెలింగ్‌కు రావాలని పిలిపించారు. ఆమె వచ్చాక ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టిన కౌన్సెలింగ్ బృందం వారి మనసులో ఏముందన్న విషయాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

వారిద్దరి మధ్యా నెలకొన్న వైవాహిక బంధం ఆరు నెలలది మాత్రమేనని, ఇంత తక్కువ సమయంలో వారు కలిసున్నది కూడా రెండు నెలలేనని తెలుస్తోంది. సాధ్యమైనంత వరకూ కౌన్సెలింగ్‌తో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు చెప్పారు.
మధుప్రియ, శ్రీకాంత్‌లను విడివిడిగా రెండు గంటలు, మరోసారి ఇద్దరిని కలిపి మరో రెండు గంటల పాటు పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించారు. వీరి ఎపిసోడ్‌ను సుఖాంతం చేసేందుకు పోలీసులు సుదీర్ఘ కౌన్సెలింగ్ ఇప్పించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications