Rose Gold: యూట్యూబ్‍లో ప్రచారం.. బ్యూటీపార్లర్‍తో నయా మోసం.. రూ.3 కోట్లు లూటీ..
ఈ మధ్య సోషల్ మీడియా ప్రచారాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు చెల్లించి కొంత భారీగా ప్రచారం చేయించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బ్యూటీ పార్లర్ పేరుతో దంపతులు ఘరానా మోసానికి తెగపడ్డారు.రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మూడు కోట్ల వసూళ్లు చేసి ఉండాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన సమీనా, ఇస్మాయిల్ దంపతులు, సమీనా జెస్సికా ఏడాది కింద రోజ్ గోల్డ్ పేరుతో బ్యూటీపార్లర్ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం భారీగా సాగుతున్నట్లు యూట్యూబ్ లో ప్రచారం చేయించారు. చిన్న పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చని తెగ ప్రచారం చేశారు. రోజ్ గోల్డ్ ఫ్రాంఛైజీ ఇస్తామని కూడా చెప్పారు. తర్వాత లక్షలు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు.

ఫ్రాంఛైజీ తీసుకుంటే ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కాస్మోటిక్స్, నెలకు రూ.35 వేల జీతం ఇస్తామని చెప్పారు. దీంతో చాలా మంది ఫ్రాంచైజీలు తీసుకోవాడనికి ముందుకొచ్చారు. నిందితులు వారి నుంచి రూ.3 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 100 మంది వరకు ఫ్రాంచైజీలు తీసుకునేందుకు డబ్బులు చెల్లించారు.
ప్రారంభంలో మూడు, నాలుగు నెలలు కాస్మోటిక్స్ సరఫరా చేయడంతో పాటు జీతం కూడా ఇచ్చారు. దీంతో ఇది నిజమైన కంపెనీ అని చాలా మంది నమ్మారు. మిగతా వారు కూడా ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. అయితే మూడు, నాలుగు నెలల తర్వాత జీతాలు ఇవ్వడం మానేశారు. ఫోన్ చేస్తే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. చివరికి బాధితులు హైదరాబాద్ ప్రగతి నగర్ లోని హెడ్ ఆ ఫీస్ కు రాగా తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే స్వీచ్ఛాఫ్ వస్తుంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications