పని మనిషితో శృంగారం, యువతికి వేధింపుల కేసు: గజల్ శ్రీనివాస్‌కు బెయిల్

హైదరాబాద్: మహిళకు వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరయింది. ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఏ2 నిందితురాలు పార్వతికి కూడా న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది.

ప్రతి బుధవారం, ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రావడంతో ఆయన విడుదల కానున్నారు. బెయిల్ పత్రాలకు సంబంధించి అన్నీ పూర్తయ్యాక ఆయన బయటకు రానున్నారు.

 ఇరుపక్షాల వాదనలు

ఇరుపక్షాల వాదనలు

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ పైన కోర్టు విచారణ జరిపింది. బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్ ఈ నెల 12న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

 ఇరవై రోజులు జైల్లో ఉన్నారంటూ

ఇరవై రోజులు జైల్లో ఉన్నారంటూ

గజల్ శ్రీనివాస్ ఇరవై రోజులకు పైగా జైలులో ఉన్నారని, ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ విచారణ నిర్ణయాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది. ఇప్పుడు ఆయనకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

పార్వతి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్

పార్వతి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్

పార్వతి కూడా ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. పార్వతిని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు పోలీసులకు చివాట్లు కూడా పెట్టింది. పరారీలో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు.

 పని మనిషితో శృంగారం

పని మనిషితో శృంగారం

కాగా, గజల్ శ్రీనివాస్ ఇద్దరు మహిళలతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా, తన ఇంటి పని మనిషితో శృంగారం, ఓరల్ సెక్స్ చేయించుకునే వీడియో క్లిప్పింగ్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+