హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు: దాల్మియా బేఖాతరు

హైదరాబాపద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విచారణకు హాజరు నుంచి కోర్టు మినహాయింపు నిచ్చింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా శుక్రవారం కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని, అందుకు అనుమతివ్వడం అని వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది.

అనంతరం అనుమతి ఇస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం శుక్రవారం శాసనసభ సమావేశాల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఓటుకు నోటు కేసులో తక్షణ చర్చ జరగాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబట్టిన నేపథ్యంలో కోర్టు అనుమతితో అసెంబ్లీకి వచ్చిన జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

Court permits YS Jagan to attend assembly

అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ కంపెనీ అధినేత పునీత్‌దాల్మియాకు ఆరుసార్లు సమన్లు జారీ చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసును సీబీఐతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+