గొప్పకొసం.. సింహాన్ని సవాల్ చేస్తానని ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తికి జైలు శిక్ష
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకునేందుకు సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకిన వ్యక్తికి కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ముఖేష్ స్నేహితులతో కలిసి మే 22వ తేదీన నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు.

మద్యం మత్తులో సింహాన్ని సవాల్ చేస్తానంటూ స్నేహితుల ముందు బీరాలు పోతూ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అందులో ఉన్న ఆఫ్రికా సింహాలు రాధిక, కృష్ణను భయపెట్టాలని క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై ముఖ్షే స్నేహితులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
భార్యతో గొడవపడి: పూటుగా తాగి సింహాల బోనులోకి దూకింది ఇతడే (ఫోటోలు)జూ ఉద్యోగి పాపయ్య, ఇతర సిబ్బంది అతడిని బయటకు తీసుకు వచ్చారు. అనంతరం సహాయ క్యురెటర్ మురళీధర్ బహదుర్ పురా పోలీస్ స్టేషన్‌లో ముఖేష్ పైన ఫిర్యాదు చేశారు. అతడి పైన అనధికారిక అతిక్రమణతో పాటు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అతనిని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండుకు తరలించారు. కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు అతనికి నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications