వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సుబ్రహ్మణ్య స్వామి రాకతో తమిళనాట రాజకీయం ముదిరే అవకాశం'

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాకతో మరింత ముదిరే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాకతో మరింత ముదిరే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులను ఆసరాగా చేసుకొని బీజేపీ అక్కడ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

కాగా, తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జయలలిత మృతి అనంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు పార్టీ పగ్గాలను శశికళ చేపట్టారు.

BJP

అదును చూసి.. ముఖ్యమంత్రి కావాలని శశికళ భావించారు. అందుకోసం పదిపన్నెండు రోజుల క్రితం అన్నాడీఎంకే శాసన సభా పక్షం సమావేశమై.. చిన్నమ్మను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకొన్నారు. ఆ తర్వాత తమిళ రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి.

అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, కొత్తగా సీఎం పేరు పళనిస్వామి వెలుగులోకి వచ్చింది. అయితే, నిన్నటి దాకా శశికళకను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.. ఇప్పుడు పళని స్వామిని ఆహ్వానించాలని చెబుతున్నారు.

English summary
CPI leader Suravaram Sudhakar Reddy has blamed BJP for Tamil Nadu crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X