వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్‌ 370 రద్దు పట్ల భగ్గుమన్న సీపిఎం..!ఆగస్టు 15ను తెలంగాణ బ్లాక్‌ డేగా పాటించాలని పిలుపు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కశ్మీర్ లో తలెత్తిన అంశాలపై సీపిఎం ఘాటుగా స్పందిస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికరణాలైన ఆర్టికల్‌ 370, 35 ఏ లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటాన్ని, కశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, ఆగస్టు 15ను 'బ్లాక్‌ డే' గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు నిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా నడుచుకుంటోందని, ముఖ్యంగా కశ్మీర్ ప్రజలు ఈ అంశం గమనించాలని సీపిఎం స్పష్టంచేస్తోంది.

370పట్ల మండిపడ్డ సీపీఎం..! కాషాయ పార్టీని కడిగేస్తున్న లెఫ్టిస్టులు..!!

370పట్ల మండిపడ్డ సీపీఎం..! కాషాయ పార్టీని కడిగేస్తున్న లెఫ్టిస్టులు..!!

కశ్మీర్ అంశం పట్ల బీజేపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని సీపిఎం ఘాటుగా విమర్శిస్తోంది. పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా మోహరింపజేపి దేశ ప్రజల ఆకాంక్షలు కాషాయ పార్టీ వమ్ము చేసిందని సీపీఎం దజమెత్తుతోంది. సంఘ్‌ పరివార్‌ బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదుల బీజేపీ ప్రభుత్వం వారి పథకంలో భాగంగానే కొద్ది రోజుల ముందు నుండే, ఆర్టికల్స్‌ 370, 35 ఏ లను రద్దు చేయటానికి ముందు, కశ్మీర్‌ లోయను దిగ్భంధం చేశారని తెలిపింది. కేంద్ర హెం శాఖ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన జాతీయ సలహాదారు అజిత్‌ ధోవల్‌, హెం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారని పేర్కొంది.

<strong>కాంగ్రెస్‌ చీఫ్‌ ఎంపికలో ట్విస్ట్...! నిర్ణయం తీసుకునేందుకు సభ్యులకు సమయం ఇచ్చిన సోనియా, రాహుల్‌..!! </strong>కాంగ్రెస్‌ చీఫ్‌ ఎంపికలో ట్విస్ట్...! నిర్ణయం తీసుకునేందుకు సభ్యులకు సమయం ఇచ్చిన సోనియా, రాహుల్‌..!!

అంతా వ్యూహాత్మకమే..! బీజేపి ఎవ్వరికి అనుమానం రాకుండా వ్యవహరించిందన్న సీపిఎం..!!

అంతా వ్యూహాత్మకమే..! బీజేపి ఎవ్వరికి అనుమానం రాకుండా వ్యవహరించిందన్న సీపిఎం..!!

అంతే కాకుండా ఉగ్ర దాడి నెపంతో కశ్మీర్ లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, అందుకే బీజేపి సైన్యాన్ని రంగంలోకి దింపిందని సీపీఎం మండిపడింది. ఉగ్రవాదుల దాడి ముప్పు ఉన్నదనే పేరుతో భారీ స్థాయిలో కశ్మీర్‌లో సైన్యాన్ని మోహరించి 144 సెక్షన్‌లు అమలు చేస్తూ, ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్స్‌ నిషేదించి ప్రజలను బయట ప్రపంచంతో దూరం చేశారని వెల్లడించింది. అమర్‌నాథ్‌ యాత్రికులను, విద్యాలయాలను మూసివేసి విద్యార్థులను కశ్మీర్‌ నుంచి వెనక్కు పంపడం మెదలుపెట్టారని, మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భంధంలోకి తీసుకున్నారని తెలిపింది.

బీజేపి చేసింది అప్రజాస్వామిక చర్య..! ప్రజలు గమనించాంటున్న విప్లవ పార్టీ..!!

బీజేపి చేసింది అప్రజాస్వామిక చర్య..! ప్రజలు గమనించాంటున్న విప్లవ పార్టీ..!!

కశ్మీర్ లోని అన్ని ప్రభుత్వ యంత్రాగాలను, ప్రముఖ నాయకులను అదుపులోకి తీసుకున్న తర్వాతనే కేంద్రం కీలక ప్రభుత్వం చేసిందని, ఇది ఆ ప్రభుత్వం ప్రణాళికలో బాగమని పేర్కొంది. ఆ తర్వాతనే రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారని, భారత్‌ -పాకిస్తాన్‌ సరిహద్దులో బలగాలను మోహరించారని పేర్కొంది. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు, ముస్లిం ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌, భద్రతాసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్‌లో చట్టాలను మార్చవచ్చును కాని ఏకపక్షంగా చట్టాల్లో మార్పులు చేసే అధికారం భారత ప్రభుత్వానికి లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు తెలిపింది.

స్వతంత్ర్య వేడుకలు వద్దు..! బ్లాక్ డే గా పిటించాలని సీపిఎం పిలుపు..!!

స్వతంత్ర్య వేడుకలు వద్దు..! బ్లాక్ డే గా పిటించాలని సీపిఎం పిలుపు..!!

జమ్మూకశ్మీర్‌లో 370,35ఏ ఆర్టికల్‌లను రద్దుచేయటాన్ని తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు, వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు జరుపుకోవటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మైనార్టీలు , దళితులు, ఆదివాసులు, అన్ని సెక్షన్ల ప్రజలు, వామపక్షాలు, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి సంస్థలు, వ్యక్తులు పార్లమెంటులో ఆమోదించి రద్దు చేసిన ఆర్టికల్‌లను పునరుద్ధరించే వరకు పోరాడాలని కోరింది. 370, 35 ఏ రద్దుకు నిరసనగా ఆగస్టు 15ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'బ్లాక్‌ డే' గా పాటించాలని మరో సారి పిలుపునిచ్చింది.

English summary
The Constitution of the state of Kashmir, which is the self-contained article 370 and 35, is to be strongly condemned by the BJP's central government The Communist Party of India (Maoist) called the Telangana State Committee to follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X