ఐదుగురు బాలురతో అసహజ లైంగిక క్రీడకు క్రికెట్ కోచ్ యత్నం
హైదరాబాద్ : ఐదుగురు బాలుర పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణపై ఓ క్రికెట్ కోచ్‌పై కేసు నమోదైంది. ఐదుగురు పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించారంటూ మంగళవారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఓ 16 ఏళ్ల బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

విశ్రాంతి సమయంలో కోచ్ సలామ్ 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల బాలురను కోచ్ గదిలోకి తీసుకుని వెళ్లి వారితో అసహజ లైంగిక క్రీడకు ప్రయత్నించాడని ఓ బాలుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సెక్షన్ 377, సెక్షన్ 511 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కోచ్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తనతో పాటు నలుగురు పిల్లల పట్ల లైంగికంగా సలామ్ అసభ్యంగా ప్రవర్తించాడని, తామంతా అతని వద్ద శిక్షణ పొందుతున్నామని, ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications