CP Sajjanar: "డబ్బులు ఊరికే రావు.."
నేటి కాలంలో సైబర్ నేరాలకు ఎవరూ అతీతులు కారు. ముఖ్యంగా చదువుకున్న, టెక్నాలజీ గురించి తెలిసిన వారే బాధితులుగా మారుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇక చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రోజూ రూ. కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. డబ్బులు ఊరికే రావని.. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు రకాల యాప్స్, ఏపీకే ఫైల్స్ వల్ల కూడా మోసాలు జరుగుతున్నాయని వివరించారు.
సైబర్ క్రైం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసేలోపే నేరగాళ్లు డబ్బులను ఖాతాల నుంచి లాగేసుకుంటారని అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించిందని తెలిపారు. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే వెంటనే హెల్ప్ లైన్ నెంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలికాలంలో చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంటూ అందినకాడికి దోచేస్తున్నారు సైబరాసురులు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఏకంగా రూ.372 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సొమ్ము కూడా కలిపితే అది రూ.976 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే తాజాగా ఇదే విషయంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ప్రతిరోజూ కోట్లాది రూపాయల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. డబుల్, త్రిపుల్ ఇన్ కమ్ వస్తుందని మాయమాటలు చెప్పి ఆన్ లైన్ యాప్స్ ద్వారా డబ్బు లాగేస్తున్నారని తెలిపారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications