పోర్న్ వెబ్‌సైట్లో ఫొటోలు, వీడియోలు పెడుతానని లేడీ టెక్కీకి బెదిరింపులు

మీ సోదరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానంటూ ఓ మహిళా టెక్కీని బెదిరించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ఓ మహిళా టెక్కీని బెదిరిస్తున్న సైబర్ నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.'నేను మీ సోదరి క్లాస్‌మెట్‌ను. ఫోన్‌ చేయమని చెప్పు. ప్రేమించకపోతే ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను ఫోర్న్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేస్తా' అని సందేశాలు పంపి మహిళా టెక్కీని ఓ యువకుడు బెదిరిస్తూ వస్తున్నాడు.

దాంతో ఆగకుండా బాధితురాలి ఒరిజనల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి నకిలీ ఖాతాను తెరిచాడు. అందరూ తనతో స్నేహం చేయవచ్చని పోస్టింగ్‌లు పెడుతున్నాడు. అతన్ని గుండుపల్లి సూర్య మణికంఠగా పోలీసులు గుర్తించారుడ. అతన్ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

 Cyber crime: youth arrested blackmailing a techie

ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా, పెద్ద గన్నవరం మండలం పెదకందలపాలెం నివాసి మణికంఠ హైదరాబాదులోని పేట్‌బషీరాబాద్‌లో ఉంటున్నాడు. ఓ కళాశాలలో ఇటీవల ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఎల్బీనగర్‌కు చెందిన క్లాస్‌మెట్‌ను పెళ్లి చేసుకోవాలని భావించాడు.

దాంతో మొబైల్‌, ఫేస్‌బుక్‌లో ఆమెకు సందేశాలు పంపించాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. అలా నిరంతరం వేధిస్తుండటంతో బాధితురాలు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఫేస్‌బుక్‌ ఖాతాను డియాక్టివేట్‌ చేసింది.

దాంతో రెచ్చిపోయిన మణికంఠ బాధితురాలి సోదరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఫోన్‌ నంబర్‌కు వాట్స్‌పలో వ్యక్తిగత చిత్రాలు పంపించాడు. మీ సోదరి ఫోన్‌ చేయకపోతే వీడియోలను ఫోర్న్‌ వెబ్‌సైట్లో పెడతానని బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో బాధితురాలి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్‌ చేసి అసభ్యకర సందేశాలను పోస్ట్‌ చేశాడు. అందులో ఆమె సోదరి సెల్‌ నంబర్‌ చెప్పాడు. బాధితురాలి సోదరికి తరచూ ఫోన్లు వస్తుండటంతో రాచకొండ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

నిందితుడిని పేట్‌బషీరాబాద్‌లో అరెస్టు చేశారు. అతడి నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకుని ఫొరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించారు. ఎంబీఏ చదువుతున్నప్పుడు బాధితురాలి ఫొటోలు తీశాడు. ఆమె సోదరికి మాయమాటలు చెప్పి కొన్ని చిత్రాలను, ఫేస్‌బుక్‌ ద్వారా మరికొన్నింటిని సంపాదించాడు. కేసును ఛేదించిన సైబర్‌ క్రైం సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+