మియాపూర్‌లో రూ.10వేలకోట్ల భారీ భూకుంభకోణం, 'పెద్దలు' ఉన్నారా?
హైదరాబాదులోని మియాపూర్‌లో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ, ప్రయివేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వేల కోట్ల రూపాయల్లో ఉన్నట్లు తేలింది. 693 ఎకరాలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాదులోని మియాపూర్‌లో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ, ప్రయివేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వేల కోట్ల రూపాయల్లో ఉన్నట్లు తేలింది. 693 ఎకరాలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.587 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పోలీసులు గుర్తించారు. అయితే దీని బహిరంగ మార్కెట్ విలువ రూ.10వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముగ్గురి అరెస్ట్
ఈ కుంభకోణానికి స్బంధించి పోలీసులు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న పీవీఎస్ శర్మను, మరో కంపెనీ డైరెక్టర్ పార్థసారథిని అరెస్టు చేశారు.

అక్రమార్కుల కన్ను
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని, ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో భూముల ధర ఎకరాకు సుమారు రూ.14.5 కోట్లు పలుకుతోంది. ఇక్కడి భూమిపై అక్రమార్కుల దృష్టి పడింది.

ముడుపుల రూపంలో..
ఎకరాకు దాదాపు రూ.2 కోట్లు ముడుపుల రూపంలో ఇచ్చి, కొందరు రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మియాపూర్‌లోని 693 ఎకరాల భూమిని దక్కించుకునేందుకు రూ.వందల కోట్లు చేతులు మారాయని అంటున్నారు.

చర్యలు
భూకుంభకోణంలో పాత్రదారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రయివేటు సంస్థలకు, వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
పోలీసులు నిందితులను మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
పోలీసులు వారి కస్టడీ కోరుతూ పిటిషన్ వేయనున్నారు. కాగా, నిందితుల వెనుక కొందరు పెద్దల హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వారిని విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications