Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్‌ తుపాను కారణంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌ వాడీ కేంద్రాలకు అక్టోబర్ 28 బుధవారం రోజున సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. అర్నబ్ తుపాను నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో స్పష్టం చేశారు.

భారత వాతావరణ శాఖ ద్వారా జారీ చేసిన వాతావరణ హెచ్చరికలు అలాగే బులెటిన్ల ప్రకారం అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా సాధారణ జనజీవనానికి అంతరాయం కలగడమే కాకుండా, విద్యార్థులు, విద్యా సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని భావించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.

Cyclone Arnab Holiday declared for educational institutions Bhadradri Kothagudem district tomorrow

ఇక అర్నబ్ తుపాను కారణంగా బుధవారం రోజున తెలంగాణలోని సూర్యపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 28వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌-యానాం ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఒక వేళ దిశ మారితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+