తెలంగాణపైనా మాండూస్ ఎఫెక్ట్: హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్: మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణపైనా పడింది. దీంతో రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలో ముసురు వాతావరణం ఏర్పడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా హైదరాబాద్ నగరలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో వాహనదారులు, ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

cyclone mandous: next three days rain in telangana districts

తుపాను మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అంటే డిసెంబర్ 14 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ తోపాటు జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణ కూడా ముసురులా పట్టినట్లుంది. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+