తెలంగాణలో తుఫాను వాతావరణం
ఈనెల 19వ తేదీన నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతుందని, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే ఏడు రోజులు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఎండ ప్రభావం చాలా తక్కువ
శనివారంనాడు తెలంగాణ అంతా దట్టమైన మేఘాలు అలముకుంటాయి. నైరుతి తెలంగాణలో మోస్తరు వాన కురుస్తుంది. మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత కల్వకుర్తి, దేవరకొండలో సాధారణ వాన, సాయంత్రం 4.00 గంటల తర్వాత హైదరాబాద్, ఖమ్మంలో మోస్తరు వానలు, సాయంత్రం 6.00 గంటల తర్వాత హైదరాబాద్ తోపాటు దక్షిణ రాయలసీమలో సాధారణ వానలు కురవనున్నాయి. ఈ సమయంలో గాలులు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ఉష్ణోగ్రత తెలంగాణలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది. దట్టమైన మేఘాలు రాష్ట్రాన్ని అలముకొని ఉండటంవల్ల ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతమంతా తేమతో ఉంది. హైదరాబాద్ లో 52 శాతం తేమ నమోదైంది.

ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ తీసుకోవాలి
రోహిణీకార్తెలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యమైన పనులుంటేనే బయటకు రావాలని, తప్పనిసరిగా గొడుగులు ధరించాలని సూచించారు. ముఖ్యమైన పనులేమైనా ఉంటే ఉదయం 10.00 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని, ఇంటి నుంచి బయటకు సాయంత్రం 4.00 గంటల తర్వాతే రావాలని తెలిపారు. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని, దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగుతుండాలని, ఎండవేడిమి తీవ్రంగా ఉంటే కొబ్బరినీటితోపాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్లు తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications