సిలిండర్ పేలుడు: నలుగురికి తీవ్రగాయాలు
రంగారెడ్డి: కుత్బుల్లాపూర్ మండలం న్యూఎల్బీనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

వరంగల్ జిల్లాలోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామంలోని జాతీయరహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన నరేస్(28) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై జగిత్యాల నుంచి కోరుట్లకు వస్తుండగా మోహన్‌రావుపేట వద్ద కోరుట్ల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నరేష్ ఇటీవలే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications