కాంగ్రెస్ కు మద్దతు : లేదు..ఆయన పై బహిష్కరణ వేటు : వైసిపి లో గందరగోళం..!
తెలంగాణ ఎన్నికల్లో మద్దతిచ్చే అంశం పై వైసిపి లో కొంత వ్యవధిలోనే గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత వైసిపి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివ కుమార్ పేరుతో వైసిపి లెటర్ హెడ్ పై ఒక ప్రకటన విడుదల అయింది. అందులో కెసిఆర్..వైయస్సార్ ను విమర్శించారని..దీంతో.. వైసిపి శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మరి, కాసేపటికే మరో ప్రకటన పార్టీ విడుదల చేసింది. ఆ ప్రకటన చేసిన శివ కుమార్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని..ఏ పార్టీకి మద్దతు లేదని వివరణ ఇచ్చింది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వైసిపి గతంలోనే నిర్ణయించింది. ఓటర్లు వారి అభీష్టానికి అనుగుణంగా ఓట్లు వేయాలని సూచించింది. అయితే, సడన్ గా వైసిపి తెలంగాణ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక ప్రకటన విడుదల అయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రచారం లో వైయస్సార్ ను దూషించారని.. దీంతో..ఇప్పటి వరకు టిఆర్‌యస్ కు అనుకూలంగా ఉన్న వైసిపి అభిమానులంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ శివ కుమార్ తన ప్రకటనలో పిలుపునిచ్చారు.

దీంతో..దీని పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పార్టీలోనూ దీని పై నిరసన లు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే పార్టీ క్రమశిక్షణా సంఘం దీని పై దృష్టి సారించింది. శివకుమార్ చేసిన ప్రకటన పార్టీకి సంబంధించి కాదని..తాము గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని వైసిపి స్పష్టం చేసింది. ఓటర్లు తమ ఆత్మసాక్షి మేరకే ఓటు వేయాలని మరోసారి పిలుపునిచ్చింది. ఇది పార్టీ అధికారిక నిర్ణయమంటూ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ కేడర్ ను గందరగోళపరిచే విధంగా ప్రకటన విడుదల చేసిన శివ కుమార్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిం చాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధి నాయకత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా సొంతంగా నిర్ణయం తీసుకున్న శివ కుమార్ పై శాశ్వత బహిష్కరణ వేటు వేస్తూ పార్టీ క్రమ శిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం పరిణామాల పై పార్టీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications