రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం సీరియస్, స్మృతి ఇరానీ స్పందన: 'విషం ఇవ్వండి'
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య పైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోమవారం నాడు స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. విద్యార్థి ఆత్మహత్య పైన ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని వేస్తున్నట్లు చెప్పారు.
ఆత్మహత్య చాలా బాధాకరమైన విషయమన్నారు. రోహిత్‌ను కోల్పోయినందుకు అతని తల్లిదండ్రులకు నేను సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు. కమిటీ సభ్యులను ఇద్దర్నీ హైదరాబాద్ పంపించామని, వారు పరిస్థితులను తమకు తెలియజేస్తారన్నారు.
Also Read: Stories about rohit suicide
కేంద్రీయ విశ్వవిద్యాలయం, వర్సిటీ పరిపాలన అధికారాలు యూనివర్సిటీకే ఉంటాయనే విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఆత్మహత్య వంటి బాధాకరమైన పరిస్థితుల్లో దానిని రాజకీయం చేయదల్చుకోలేదన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నారు. నివేదిక వచ్చాక చూస్తామని చెప్పారు.

హెచ్‌సియు ఆత్మహత్య ఘటనను కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై రేపటి వరకు నివేదిక ఇవ్వాలని స్మృతి ఇరానీ ద్విసభ్య కమిటీకి సూచించారు.
విషం ఇవ్వమన్న రోహిత్!
తన ఆత్మహత్యకు వారం రోజుల ముందు రోహిత్ వైస్ ఛాన్సులర్ అప్పారావుకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అడ్డుకునే బదులు తమకు విషం ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యాంటీ నేషనల్ రాజకీయాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గత ఏడాది అంటే 15 ఆగస్టు 2015న లేఖ రాశారు. ఆ లేఖలో.. యాకూబ్ మెమెన్ ఉరితీతను నిరసిస్తూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సస్పెన్షన్‌కు దారి తీసిందని అంటున్నారు. ఈ సెగ ఢిల్లీని కూడా తాకింది.
'ఎవరూ కారణం కాదు..'
తన మృతికి ఎవరూ కారణం కాదని రోహిత్ తన సూసైడ్ నోట్లో పెర్కొన్నారు. నా ఆత్మహత్యకు నేనే కారణమని పేర్కొన్నారు. రోహిత్ మృతికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, విసి అప్పారావు కారణమని విద్యార్థులు కొందరు ఆరోపిస్తున్నారు. తమ తప్పు లేదని వారు వివరణ ఇచ్చారు కూడా.












Click it and Unblock the Notifications